సీఎం స్టాలిన్ కు మైసూర్ పాక్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్

సీఎం స్టాలిన్ కు మైసూర్ పాక్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్

తమిళనాడులో లోక్ సభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కోయంబత్తూరులోని సింగనల్లూరులో ప్రచారం తర్వాత కాస్త విరామం తీసుకున్నారు.

అక్కడున్న ఓ స్వీట్ షాప్ ను సందర్శించారు. డివైడర్ ను దాటి రోడ్డుకు అవతల వైపున్న స్వీట్ షాపులో గులాబ్ జామున్ ఆరగించారు. అనంతరం ఇక్కడ ఫేమస్ ఏంటని సిబ్బందిని అడగ్గా..వారు మైసూర్ పాక్ అని చెప్పడంతో..  తమిళనాడు సీఎం స్టాలిన్ కోసం మైసూర్ పాక్ తీసుకున్నారు రాహుల్. తర్వాత స్వీట్ షాప్ సిబ్బంది రాహుల్ గాంధీతో ఫొటోలు దిగారు. అనంతరం స్టాలిన్ కు మైసూర్ పాక్ ను అందజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.