మణిపూర్ విషయంలో మోదీ డ్రామాలు : రాహుల్ గాంధీ

మణిపూర్ విషయంలో మోదీ డ్రామాలు : రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లోక్ సభలో అవిశ్వాసంపై చర్చ సందర్భంగా గురువారం (ఆగస్టు 10న) కాంగ్రెస్ పార్టీపై చేసిన విమర్శలపై రాహుల్ గాంధీ స్పందించారు. లోక్‌సభలో ప్రధాని మోదీ మాట్లాడిన తీరు విచారకరమని అన్నారు. మణిపూర్ విషయంలో ప్రధాని మోదీ డ్రామాలాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మణిపూర్ మంటల్లో పెట్రోల్ పోస్తుంది ఎవరని ప్రశ్నించారు. మణిపూర్ మంటలను ఆర్పడం కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం లేదన్నారు. మణిపూర్ ఇష్యూను తమాషాగా మార్చారని చెప్పారు. ఇండియా వాయిస్ ను మణిపూర్ లో మర్డర్ చేశారని, దేశంలో ఏం జరుగుతుందో మోదీకి తెలియదా..? అని ప్రశ్నించారు. 

మణిపూర్ లోని రెండు వర్గాలతో మోదీ ఎందుకు మాట్లాడలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. భారతమాతను హత్య చేశారు అని తాను మాట్లాడలేదని వివరణ ఇచ్చారు. భారత సైన్యం తలుచుకుంటే మణిపూర్ లోని అల్లర్లను రెండు రోజుల్లో ఆపగలదని చెప్పారు. ప్రధాని మోదీ కనీసం మణిపూర్ కు వెళ్లారా..? అని ప్రశ్నించారు. 

ప్రధాని రాజకీయ నేత కాదని.. భారతదేశ ప్రజలందరి ప్రతినిధి అని చెప్పారు. ఆయన ఓ రాజకీయ నాయకుడిలా మాట్లాడుకూడదన్నారు. ప్రధాని అసలు సమస్య గురించి మాట్లాడలేదు. గతంలో ఎందరో ప్రధానులను చూశానని, కానీ, ఇలా దిగజారి మాట్లాడిన ప్రధానిని తానెప్పుడూ చూడలేదన్నారు రాహుల్‌ గాంధీ.