
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీపై అణుబాంబు కాదు.. ఈ సారి హైడ్రోజన్ బాంబు పేల్చుతామంటూ ప్రకటించారు. ఓటు చోరీ నినాదాలు చైనాలో చైనాలో మోగుతున్నాయని.. ఓటు చోరీ స్కాంను బయటపెట్టిన తర్వాత ప్రధాని మోదీ ప్రజలను ఎదుర్కోలేకపోతున్నారని అన్నారు.
బీజేపీ నేతలకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా.. మీరు అణుబాంబు కంటే పెద్దదాని గురించి విన్నారా.. అది హైడ్రోజన్ బాంబు. హైడ్రోజన్ బాంబు త్వరలోనే పేలబోతోంది. రెడీగా ఉండండి.. త్వరలోనే ఓట్ల చోరీకి సంబంధించిన అన్ని నిజాలు బయటికి వస్తున్నాయి.. అని అన్నారు. ఒక్కసారి హైట్రోజన్ బాంబు పేలితే నరేంద్ర మోదీ ఈ దేశ ప్రజలకు తన మొహం కూడా చూపించలేరని అన్నారు రాహుల్.
ఓట్ చోర్.. గద్దీ ఛోడ్ .. అనే నినాదాలు ఇచ్చామని.. అది ఇప్పుడు చైనాలో కూడా ప్రతిధ్వనిస్తోందని అన్నారు. ఇప్పుడు అమెరికాలో కూడా ప్రజలు ఓట్ చోర్ గురించి మాట్లాడుకుంటున్నట్లు చెప్పారు.
రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తిప్పికొట్టింది. ఆయన బాంబులు అంటున్నారు.. అవి పేలనుగాక పేలవు అని అన్నారు. రాహుల్ గాంధీ ఆరోపణలకు కట్టుబడి ఉంటే ఎలక్షన్ కమిషన్ అడిగినట్లుగా అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేక పోతున్నారని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు.