
కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రేపు(మంగళవారం) మాన్సాలోని సిద్ధూ మూసేవాలా కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఆయన అక్కడికి చేరుకోనున్నారు. ఈ మేరకు పార్టీ వర్గాలు తెలిపాయి. సిద్ధూ మూసేవాలా హత్య జరిగినప్పుడు రాహుల్ వీదేశీ పర్యటనలో ఉన్నారు. ఇక ఇవాళ (సోమవారం) రాజస్థాన్ కాంగ్రెస్ నేత సచిన్ పైలట్, హర్యానా ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ డాక్టర్ అశోక్ తన్వర్ సహా పలువురు లీడర్లు మూసేవాలా కుటుంబాన్ని పరామర్శించారు. కాగా పంజాబ్ ప్రభుత్వం భద్రత ఉపసంహరించిన మరునాడు సొంత ఊరికి కారులో వెళ్తున్న సిద్ధూ మూసేవాలాపై కొందురు దుండగులు కాల్పులు జరిపారు. దీనితో సిద్ధూ అక్కడిక్కడే చనిపోయాడు.
మరిన్ని వార్తలు
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్
కరెన్సీ నోట్లలో ఎలాంటి మార్పు చేయం