తల్లికి సర్​ప్రైజ్​ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్

తల్లికి సర్​ప్రైజ్​ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్

న్యూఢిల్లీ: రాహుల్​ గాంధీ తన తల్లి సోనియా కు ఓ గిఫ్ట్​ఇచ్చి సర్​ప్రైజ్ చేశారు. ఓ క్యూట్ కుక్క పిల్లను కొడుకు నుంచి అందుకున్న సోనియా సంబురపడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ తన యూట్యూబ్ ఛానెల్​లో షేర్ చేశారు. ఈ ఏడాది ఆగస్టులో రాహుల్ గాంధీ గోవాలో పర్యటించారు. 

ఆ సమయంలో పెంపుడు కుక్కల కేంద్రాన్ని నడుపుతున్న ఇద్దరు దంపతులను ఆయన కలిశారు. అక్కడ జాక్ రస్సెల్ టెర్రియర్ జాతికి చెందిన ఆడ కుక్క పిల్లను తనతో పాటు ఢిల్లీకి తీసుకొచ్చారు. దాన్ని  ఒక బాక్స్​లో పెట్టి సోనియా ముందు ఉంచి తెరవమని కోరారు. బాక్స్​ తెరిచిన ఆమె ఆమె ముఖం సంతోషంతో వెలిగిపోయింది. కాగా ఆ కుక్కపిల్లకు ‘నూరీ’గా పేరు పెట్టారు.