రాహుల్ ఔదార్యం.. పాక్ షెల్లింగ్లో పేరెంట్స్ను కోల్పోయిన పిల్లల దత్తత

రాహుల్  ఔదార్యం.. పాక్ షెల్లింగ్లో పేరెంట్స్ను కోల్పోయిన పిల్లల దత్తత

రాజౌరి: కాంగ్రెస్  ఎంపీ రాహుల్  గాంధీ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ఆపరేషన్  సిందూర్  సమయంలో జమ్మూకాశ్మీర్  సరిహద్దుల వద్ద పాకిస్తాన్  సైన్యం జరిపిన కాల్పుల్లో పేరెంట్స్​ను కోల్పోయిన పిల్లలను ఆయన దత్తత తీసుకోనున్నారు. 

సొంత ఖర్చులతో వారిని గ్రాడ్యుయేషన్ వరకు చదివించనున్నారు. ఈ విషయాన్ని జమ్మూకాశ్మీర్  కాంగ్రెస్  కమిటీ ప్రెసిడెంట్ తారిక్ హమీద్  కర్రా తెలిపారు. ఆపరేషన్  సిందూర్  సమయంలో పాక్ షెల్లింగ్​లో కొంతమంది పౌరులు చనిపోయారని, దీంతో వారి పిల్లలు అనాథలుగా మిగిలారని తారిక్​ తెలిపారు.