పాక్ తో కీలక పోరు.. రాహుల్‌‌ ప్రాక్టీస్‌‌ షురూ..

పాక్ తో కీలక పోరు.. రాహుల్‌‌ ప్రాక్టీస్‌‌ షురూ..

కొలంబో: ఆసియా కప్‌‌‌‌‌‌లో ఐదు రోజుల బ్రేక్‌‌‌‌ రావడంతో టీమిండియా ప్రాక్టీస్‌‌‌‌ పెంచింది. ఆదివారం పాకిస్తాన్‌‌‌‌తో కీలక పోరు ఉండటంతో యంగ్‌‌‌‌స్టర్స్‌‌‌‌ అందరూ నెట్స్‌‌‌‌లో తీవ్రంగా చెమటోడ్చారు. గురువారం కొలంబోలోని ఎన్‌‌‌‌సీసీ ఇండోర్‌‌‌‌ నెట్స్‌‌‌‌లో ప్రాక్టీస్‌‌‌‌ చేసిన సూర్యకుమార్‌‌‌‌, శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌కు కోచ్‌‌‌‌ రాహుల్‌‌‌‌ ద్రవిడ్‌‌‌‌ సూచనలు ఇచ్చాడు. గాయం నుంచి కోలుకున్న కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ మొదట రన్నింగ్‌‌‌‌ ప్రాక్టీస్‌‌‌‌ చేసి తర్వాత బ్యాటింగ్‌‌‌‌కు పదును పెట్టుకున్నాడు.

ఒకవేళ రాహుల్‌‌‌‌ ఫుల్‌‌‌‌ ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌తో ఉంటే పాక్‌‌‌‌తో మ్యాచ్‌‌‌‌కు శ్రేయస్‌‌‌‌  అయ్యర్‌‌‌‌ ప్లేస్‌‌‌‌లో బరిలోకి దిగే  చాన్సెస్‌‌‌‌ కనిపిస్తున్నాయి. పాక్‌‌‌‌పై ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ చెలరేగడంతో అతన్ని కంటిన్యూ చేయాలని ద్రవిడ్‌‌‌‌ భావిస్తున్నాడు. ఇక ఆల్‌‌‌‌రౌండర్లు హార్దిక్‌‌‌‌ పాండ్యా, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ బౌలింగ్‌‌‌‌ చేస్తూ కనిపించారు. అయితే బుమ్రా తిరిగి రావడంతో షమీ, సిరాజ్‌‌‌‌లో ఒకరికి మాత్రమే అవకాశం దక్కనుంది. కెప్టెన్‌‌‌‌ రోహిత్‌‌‌‌ శర్మ, విరాట్‌‌‌‌ ఈ సెషన్‌‌‌‌కు డుమ్మా కొట్టారు. అయితే కోహ్లీ మాత్రం జిమ్‌‌‌‌లో కసరత్తులు చేసిన ఫొటోస్‌‌‌‌ సోషల్‌‌‌‌ మీడియాలో దర్శనమిచ్చాయి.