అసలు మీ గొడవేంటి.. వైరల్ అవుతున్న రాహుల్ కామెంట్

అసలు మీ గొడవేంటి.. వైరల్ అవుతున్న రాహుల్ కామెంట్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, యాంకర్ అనసూయల వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వివాదంలో కొందరు అనుకి మద్దతుగా నిలుస్తుంటే.. మరికొందరు విజయ్ ని వెనకేసుకొస్తున్నారు. ఇక తాజాగా.. ఈ వివాదంపై మరో వీడియో చేసింది అనసూయ.

ఈ వీడియోలో.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ని చేతకాని వాళ్ళని, వాళ్ళు అదుపు తప్పారని తిట్టేసింది. నిజంగా మీడియాకు ధైర్యం ఉంటే నిజాలు రాయాలంటూ మండిపడింది. ఆతరువాత ఓ ట్వీట్ చేసిన అను.. నన్ను తిడితే మీ నోళ్లు కంపు అవుతాయి. నాకు ఏమీ కాదు. నాది గొప్ప పెంపకం. ఏదైనా ధైర్యంగా మాట్లాడతాను. మీ పెంపకం ఎలాంటిదో మీరే తెలుసుకోండి. తిట్టే వాళ్ళు సిగ్గుపడాలి, తిట్టించుకున్న వాళ్ళు కాదు, అని కామెంట్ చేసింది.

అనసూయ చేసిన ఈ రెండు ట్వీట్స్ వైరల్ అవుతున్న వేళ.. వాటిపై నటుడు రాహుల్ రామకృష్ణ స్పందించారు. ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోవద్దు. క్యూరియాసిటీతో అడుగుతున్నాను. ఇంతకీ ఈ గొడవేంటి? ఇవ్వన్నీ మీరు ఎందుకు చేస్తున్నారని అంటూ కెమెంట్ చేసాడు రాహుల్ రామకృష్ణ. దీంతో ఈ ట్వీట్ కూడా క్షణాల్లోనే వైరల్ గా మారింది. మరి రాహుల్ రామకృష్ణ వేసిన క్వశ్చన్ కి అనసూయ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.