సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లిసందడి

సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఇంట పెళ్లిసందడి

టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్(Rahul Sipligunj) ఇంట పెళ్లిసందడి నెలకొంది. రాహుల్ తమ్ముడు నిఖిల్ సిప్లిగంజ్(Nikhil Sipligunj)వివాహం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని వధువరులను ఆశీర్వదించారు. ఇక తాజాగా ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రాహుల్ సిప్లిగంజ్ తన ఇన్‌స్టాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

ఇక రాహుల్ సిప్లిగంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టాలీవుడ్ సింగర్ గా, బిగ్ బాస్(Bigg boss) విన్నర్ గా ఆయన తెలుగు ప్రజలకు సుపరిచితమే. ఇక రీసెంట్ గా ఆర్ఆర్ఆర్(RRR) సినిమాలో సూపర్ హిట్ ఐన నాటు నాటు(Naatu naatu) పాటను పాడింది కూడా రాహుల్ నే. ఈ పాటకు ఆస్కార్ అవార్డు కూడా వచ్చింది. ఈ సందర్బంగా ఆస్కార్ స్టేజిపై నాటు నాటు సాంగ్ లైవ్ పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చాడు రాహుల్ సిప్లిగంజ్.