
ముంబై: వైస్ అడ్మిరల్ రాహుల్ విలాస్ గోఖలే భారత నౌకాదళం పశ్చిమ నౌకా కమాండ్‌కు చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు. నావిగేషన్, డైరెక్షన్‌లో నిపుణుడైన గోఖలే.. ఈ పదవికి ముందు భారత నౌకాదళం పశ్చిమ ఫ్లీట్‌కు నాయకత్వం వహించారు. గోఖలే పుణెలోని నేషనల్ డిఫెన్స్ అకాడమీ, వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, గోవాలోని నావల్ వార్ కాలేజ్, కాన్‌బెర్రాలోని ఆస్ట్రేలియన్ డిఫెన్స్ కాలేజీల్లో విద్యనభ్యసించారు. ఆయన కమాండ్ నియామకాలలో ఐఎన్‌ఎస్ కోరా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఐఎన్‌ఎస్ ఖుక్రీ, ఐఎన్‌ఎస్ కోల్‌కతా కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేశారు. అలాగే, పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో భారత హైకమిషన్‌లో నావల్ అడ్వైజర్‌గా కూడా పనిచేశారు. ఫ్లాగ్ ర్యాంక్‌కు పదోన్నతి పొందే ముందు ఐఎన్‌ఎస్ సర్కార్స్‌కు కమాండ్‌గా ఉన్నారు.