దేశాన్ని ముక్కలు కానివ్వను: రాహుల్

దేశాన్ని ముక్కలు కానివ్వను: రాహుల్

ఐదేండ్ల పాలనలో మోడీ  చేసిన అన్యాయాలకు జనం బలైపోయారని, దేశానికి న్యాయం చేయగల ఏకైక పార్టీ తమదేనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ అన్నారు. నోట్ల రద్దు, జీఎస్టీతోఆర్థిక వ్యవస్థ నడ్డి విరిగిందని, న్యాయ్ ద్వారా నిరు పేదల అకౌంట్లలో ఏటా రూ72 వేలు జమచేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెడతామన్నారు. అనిల్ అంబానీకి ఎయిర్ పోర్స్ ని  తాకట్టుపెట్ట జూసిన మోడీనే అసలు దేశద్రోహి అని, దొరికిపోయాడు కాబట్టే ఇప్పుడు ఉల్టా ప్రచారం చేస్తున్నారని మండి పడ్డారు. గొంతులో ప్రాణమున్నంత వరకూ దేశాన్నిరెండు ముక్కలు కానివ్వనని, ఒకటే జాతీయ జెండా,ఒకటే పార్లమెంట్ ఉంటాయని రాహుల్ ఉద్ఘాటించారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కరీంగంజ్ (అస్సాం), గయా(బీహార్ ) సభల్లోఆయన మాట్లాడారు.

ధైర్యంగా ఉండండి వచ్చేది మన సర్కార్‘‘

ఐదేండ్ల కిందటే ఇదే గయాలో మోడీ మాట్లాడుతూ,రెండు కోట్ల ఉద్యోగాలు, పేదల అకౌంట్లో 15 లక్షలు,బీహార్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తానన్నారు. వాటిలోఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. పెద్దోళ్ల ఇండి యా,పేదోళ్ల ఇండియాగా దేశాన్ని ముక్కలు చేసిన పాపంమోడీదే. మీ భయం పోగొట్టడా నికే కాంగ్రెస్ న్యాయ్పథకం తీసుకొచ్చింది. బీహారీ యువకుల్ని గుజరాత్,మహారాష్ట్రల్లో తరిమికొడతారు. ఆ పరిస్థితి పోవాలి.స్థానికంగానే ఉద్యోగాలు సృష్టిస్తాం’’ అని రాహుల్చెప్పారు. ప్రతిపక్షనాయకుల్ని దేశద్రోహులంటూప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీకి దమ్ముంటే ఒక్కసారి డిబేట్ కు రావాలని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ సవాలుచేశారు. మోడీ పెద్ద డర్ పోక్ (పిరికిపంద)అని, చర్చకురమ్మంటే పారిపోతారని మండిపడ్డారు.