రైల్వేలో ప్రక్షాళన.. లేటుగా వస్తున్న ఉద్యోగులపై యాక్షన్...

రైల్వేలో ప్రక్షాళన.. లేటుగా వస్తున్న ఉద్యోగులపై యాక్షన్...

రైల్వే శాఖలో పని చేసే ఉద్యోగులు ఇకపై లేట్​గా వస్తే అంతే సంగతులు. తరచూ ఆఫీస్ కి లేట్​గా వస్తున్న ఉద్యోగులపై చర్యలు తీసుకునే సంబంధిత ఉత్తర్వులను రైల్వే శాఖ జారీ చేసింది. ఉద్యోగులు ఉదయం 9 గంటలలోపు ఆఫీస్ లో ఉండాలని లేదంటే హాఫ్ డే క్యాజువల్​ లీవ్​కోల్పోవాల్సి వస్తుందని అందులో ఉంది. ప్రతి రోజూ లేట్​గా వచ్చే వారు సెలవు కోల్పోయే అవకాశం ఉందని హెచ్చరించింది. సమయానికి రావడమే కాదు.. త్వరగా వెళ్లిపోవద్దని ఉత్తర్వుల్లో పేర్కొనడం గమనార్హం.

ఉద్యోగులు లేట్​గా రావడం వల్ల ఆఫీస్ సామర్థ్యం గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.2014 నుంచి బోర్డు కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల హాజరు శాతాన్ని గుర్తించేందుకు ఆధార్‌ బయోమెట్రిక్ అటెండెన్స్ సిస్టమ్ ను ప్రారంభించినట్లు వారు తెలిపారు.  టైమింగ్స్ పాటించాలని, సూపర్‌వైజర్లు బయోమెట్రిక్ అటెండెన్స్ ని సరిగ్గా పర్యవేక్షించాలని 2016 –17లో ఆదేశాలు జారీ చేశారు. సెక్షన్ అధికారులు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు తమ కింద పనిచేసే అధికారులు, సిబ్బంది అందరూ సమయ పాలన పాటించాలని కోరారు.  ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30 వరకు ఆఫీస్​ టైమింగ్స్ ఉండగా మధ్యలో 1 నుంచి 1.30 కాలంలో లంచ్ టైంగా అధికారులు నిర్ణయించారు.   మొత్తంగా ఒక నెలలో రెండు సార్లు గంటకు మించకుండా సరైన కారణంతో ఆలస్యంగా వస్తే పరిగణించవచ్చని ఉత్తర్వుల్లో ఉంది. ఈ నిర్ణయాలపై రైల్వే ఉద్యోగులు భిన్నంగా స్పందిస్తున్నారు.