విశాఖ రైల్వే జోన్ పై  పుకార్లను నమ్మొద్దు

విశాఖ రైల్వే జోన్ పై  పుకార్లను నమ్మొద్దు

న్యూఢిల్లీ: విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర రైల్వే శాఖమంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు. కేంద్రం విశాఖ రైల్వే జోన్ ను ఏర్పాటు చేయడం లేదంటూ వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైల్వే జోన్ ఏర్పాటుకు విశాఖ డీఆర్ఎమ్ ఆఫీస్ దగ్గరలో భూమి అందుబాటులో ఉందని తెలిపారు. రైల్వే జోన్ ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.