రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండెంట్ పంపలే : రైల్వే మంత్రి వైష్ణవ్

రాష్ట్ర ప్రభుత్వాలకు ఇండెంట్ పంపలే : రైల్వే మంత్రి  వైష్ణవ్
  •     హైస్పీడ్​ రైలు పేరుతో భూసేకరణ
  •     చట్టవిరుద్ధం : రైల్వే మంత్రి  వైష్ణవ్ 

న్యూఢిల్లీ: అధికారిక అభ్యర్థన లేకుండా హైస్పీడ్ రైలు పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే భూ సేకరణ చట్ట విరుద్ధమని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​ వెల్లడించారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలకు తాము ఎటువంటి అధికారిక ఇండెంట్ పంపలేదని స్పష్టం చేశారు. హైదరాబాద్–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు, హైదరాబాద్–పుణె హైస్పీడ్ రైలు కారిడార్లపై చర్చించేందుకు కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్​తో సమావేశమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన పలు కీలక విషయాలు వెల్లడించారు. ప్రస్తుతం 3 కారిడర్లకు సంబంధించి అలైన్​మెంట్ సర్వేలు జరుగుతున్నాయని, ఈ దశలో అధికారికి అభ్యర్థన లేకుండా హైస్పీడ్​రైలు పేరుతో ఎక్కడైనా భూ సేకరణ జరిపితే అది పూర్తిగా చట్ట విరుద్దమే అవుతుందని హెచ్చరించారు.