రైలులో అసభ్యంగా ప్రవర్తన.. హోంగార్డు అరెస్ట్

రైలులో అసభ్యంగా ప్రవర్తన.. హోంగార్డు అరెస్ట్

సికింద్రాబాద్,వెలుగు :  రైలులో బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన హోంగార్డును రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.  కాచిగూడ రైల్వే ఇన్​స్పెక్టర్​ ఎల్లప్ప తెలిపిన ప్రకారం..​బాలిక తన తల్లిదండ్రులతో కలిసి బాలిక(15) చిత్తూరు నుంచి -కాచిగూడకు వెంకటాద్రి ఎక్స్​ప్రెస్​రైలులో ఎస్​-3 బోగీలో ప్రయాణిస్తుంది. అదే బోగీలో రామంతాపూర్​లో ఉండే ఏపీలోని కోడూరు  పీఎస్ లో  హోం గార్డు ప్రతాప్​(43)  వస్తున్నాడు. అర్ధరాత్రి బాలిక పడుకోగా బెర్త్​పక్కనే నిలబడి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. వెంటనే బాలిక లేచి తన పేరెంట్స్ కు చెప్పగా.. కాచిగూడ రైల్వే పోలీసులకు కంప్లయింట్ చేశారు. హోంగార్డు ప్రతాప్​ను అదుపులోకి తీసుకుని విచారించగా రైలులో టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లు ఇన్​స్పెక్టర్​ఎల్లప్ప తెలిపారు.