వృద్దురాలిని కాపాడిన రైల్వే పోలీస్

వృద్దురాలిని కాపాడిన రైల్వే పోలీస్

రైల్వే పోలీసు ఓ వృద్ధురాలి ప్రాణాన్ని రక్షించాడు. వృద్దురాలు పట్టాలు దాటుతుండగా అకస్మాత్తుగా  రైలు దూసుకొస్తుంది.  దీన్ని గమనించిన రైల్వే పోలీసు వెంటనే పరిగెత్తుకొచ్చి ఆమెకు పైగా లాగేశాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లక్నో రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. 

 రైల్వే స్టేషన్‌లో ఓ వృద్ధురాలు పట్టాలు దాటుతోంది. ఆమె దాటుతున్న పట్టాలపై నుంచి రైలు వస్తోంది. స్థానికంగా ఉన్న రైల్వే పోలీసులు..రైలు వస్తోంది వెనక్కు వెళ్లాలని ఆమెను వారించాడు. ఇవేమి పట్టించుకోని వృద్దురాలు..పట్టాలపై నడుచుకుంటూ వస్తోంది.  అటు రైలు వేగంగా వస్తుండటంతో..ప్లాట్‌ఫామ్‌ చివరికి పరుగెత్తిన  కానిస్టేబుల్‌... ఆమెను పైకి లాగేశాడు. సెకను వ్యవధిలో రైలు వాళ్లను దాటుకుంటూ వెళ్లిపోయింది.  అయితే ఆమెకు ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. 

ఈ దృశ్యాలు ప్లాట్‌ఫామ్‌పై ఉన్న కెమెరాలో రికార్డయ్యాయి.  స్థానిక రైల్వే అధికారులు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఇప్పటి వరకు 70 వేలకు పైగా ఈ వీడియోను వీక్షించారు.  వృద్ధురాలిని కాపాడిన రైల్వే పోలీసును అధికారులు, నెటిజన్లు అభినందిస్తున్నారు.