మాస్కులు, శానిటైజర్లు తయారు చేసిన రైల్వే

మాస్కులు, శానిటైజర్లు తయారు చేసిన రైల్వే
  • ఇప్పటి వరకు ఆరు లక్షల మాస్కులు, 40వేల లీటర్ల శానిటైజర్

న్యూఢిల్లీ: కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడే సామాగ్రిని తయారు చేసేందుకు అందరూ కృషి చేస్తున్నారు. ఈ మేరకు రైల్వే శాఖ ఇప్పటి వరకు 6 లక్షల మాస్కులు, 40 వేల లీటర్ల హ్యాండ్‌ శానిటైజర్లను తయారు చేసింది. “ కరోనాను నివారించేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలకు అనుబంధంగా రైల్వే పనిచేస్తోంది. ఈ మేరకు జోనల్‌ రైల్వే ఆఫీసులు, ప్రొడక్షన్‌ యూనిట్లు, పిఎస్‌యూలలో మాస్కులు, శానిటైజర్లు తయారు చేస్తోంది” అని ప్రకటించింది. ఏప్రిల్‌ 7 నాటికి 5.82 లక్షల మాస్కులు, 41,822 లీటర్ల శానిటైజర్‌‌ను తయారు చేశామని రైల్వే శాఖ అధికారులు చెప్పారు. తయారీ ప్రదేశాల్లో అన్ని నిబంధనలు పాటిస్తూ సోషల్‌ డిస్టెంసింగ్‌ మెయింటైన్‌ చేస్తున్నామని అన్నారు.