
భారతీయ రైల్వేలో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు(ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30.
పోస్టులు: దేశంలోని అన్ని ఆర్ఆర్బీల్లో కలిపి 2570 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిపోట్ మెటీరియల్ సూపరింటెండెంట్ (డీఎంఎస్), కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ (సీఎంఏ)లో జూనియర్ ఇంజినీర్ (జేఈ) పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి సంబంధిత విభాగంలో బి.టెక్/ బీఈ, డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 33 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: అక్టోబర్ 31.
లాస్ట్ డేట్: నవంబర్ 30.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్, మహిళా అభ్యర్థులకు రూ.250. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500.
సెలెక్షన్ ప్రాసెస్: రెండు అంచెల్లో నిర్వహించే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు rrbguwahati.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.