స్పోర్ట్స్ కోటాలో రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

స్పోర్ట్స్ కోటాలో  రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. ఎగ్జామ్ లేదు.. టెన్త్, ఇంటర్ పాసైతే చాలు..

రైల్వే రిక్రూట్​మెంట్ సెల్(RRC) సికింద్రాబాద్ దక్షిణమధ్య రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్​లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 14.

పోస్టుల సంఖ్య: 61

పోస్టులు : ఎస్​సీఆర్, హెడ్​క్వార్టర్స్, సికింద్రాబాద్ కోటా 21, హెడ్​క్వార్టర్స్ కోటా 10, సికింద్రాబాద్ డివిజన్ 05, హైదరాబాద్ డివిజన్ 05, విజయవాడ డివిజన్ 05, గుంతకల్ డివిజన్ 05, గుంటూరు డివిజన్ 05, నాందేడ్ డివిజన్ 05. 

ఎలిజిబిలిటీ: పదోతరగతి లేదా ఐటీఐ లేదా ఎన్​సీవీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటీస్ సర్టిఫికెట్ ఉండాలి. (బి) జీపీ–1900/ 2000 ఉన్న పోస్టులకు 12వ తరగతి లేదా సమానమైన అర్హత  ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 25 ఏండ్ల మధ్యలో ఉండాలి. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ప్రారంభం: అక్టోబర్ 25.

అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మైనార్టీలు, ఈడబ్ల్యూఎస్​లకు రూ.250. ఇతరులకు రూ.500. 

లాస్ట్ డేట్: నవంబర్ 14. 

సెలెక్షన్ ప్రాసెస్: డాక్యుమెంట్ వెరిఫికేషన్, స్పోర్ట్స్ ట్రయల్స్​లో కనబర్చిన ప్రతిభ, క్రీడల్లో సాధించిన పతకాలు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

పూర్తి వివరాలకు scr.indianrailways.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.