భూటాన్– ఇండియా మధ్య రైలు మార్గం

భూటాన్– ఇండియా మధ్య రైలు మార్గం

న్యూఢిల్లీ: భూటన్​కు ఇండియా రైలు మార్గం వేయనుంది. రెండు క్రాస్ బార్డర్ రైల్వే లింక్ లను నిర్మించనుంది. ఈ ఉమ్మడి ప్రణాళికకు సంబంధించిన వివరాలను రైల్వే మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్, విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సోమవారం మీడియాకు వెల్లడించారు.

 బెంగాల్ లోని బనార్హత్ ను సంట్సేతో అస్సాంలోని కోక్రాఝర్ ను గెలెఫుతో అనుసంధానించడంతో పాటు క్రాస్ బార్డర్ లింక్ లను నిర్మింwvచడానికి భారత్, భూటాన్ అంగీకరించాయని విక్రమ్ మిస్రీ తెలిపారు. రెండు దేశాలు పరస్పర గౌరవం, అవగాహనతో కూడిన సంబంధాన్ని పంచుకుంటాయని చెప్పారు. 

ఈ ప్రాజెక్టులు భారత రైల్వేల నెట్ వర్క్ నుంచి ప్రారంభమవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల కింద 89కిమీ రైల్వే నెట్ వర్క్ ను దాదాపు  రూ.4,033 కోట్ల అంచనా వ్యయంతో 

నిర్మించనున్నట్టు ఆయన వివరించారు.