ఆన్‌‌లైన్‌‌లో రైల్వే స్మార్ట్​కార్డ్ రీచార్జ్‌‌

ఆన్‌‌లైన్‌‌లో రైల్వే స్మార్ట్​కార్డ్ రీచార్జ్‌‌

హైదరాబాద్‌‌, వెలుగు: డిజిటలైజేషన్‌‌లో భాగంగా రైల్వేశాఖ పలు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే అన్‌‌రిజర్వుడు టికెట్ల కోసం ప్రయాణికులు క్యూ లైన్లలో నిలబడకుండా ఏటీవీఎం(ఆటోమెటిక్‌‌ టికెట్‌‌ వెండింగ్‌‌ మెషిన్స్‌‌)లను అందుబాటులోకి తెచ్చింది. వాటికి సంబంధించిన స్మార్ట్‌‌ కార్డును రిచార్జ్​ చేసుకోవడానికి ప్రతిసారి బుకింగ్​కౌంటర్లకు రావాల్సి వచ్చేది. ఇకపై www.utsonmobile.indianrail.gov.in లో యూటీఎస్‌‌ ద్వారా ఆన్‌‌లైన్‌‌ పద్ధతిలో స్మార్ట్​కార్డులు రీచార్జ్‌‌ చేసుకోవచ్చు. డెబిట్‌‌కార్డులు, ఇంటర్నెట్‌‌ బ్యాకింగ్‌‌, యూపీఐ ద్వారా చెల్లింపులు చేయొచ్చు. ఫస్ట్‌‌ టైం స్మార్టు కార్డు పొందడానికి అడ్రస్‌‌ ప్రూఫ్‌‌, ఇతర వివరాలను అందజేయాలి. తర్వాత టికెట్లు పొందడానికి కనీసం రూ.100తో మొదటిసారి స్మార్ట్‌‌ కార్డు రీచార్జ్​చేసుకోవాలి. ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాలని సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వే జీఎం గజానన్‌‌ మాల్య కోరారు.