20వేల టిక్కెట్లు రద్దు.. రైల్వేకు రూ.1.22 కోట్ల నష్టం.. ఆలస్యమే కారణం

20వేల టిక్కెట్లు రద్దు.. రైల్వేకు రూ.1.22 కోట్ల నష్టం.. ఆలస్యమే కారణం

ఉత్తర భారతదేశంలో కొనసాగుతున్న చలిగాలుల పరిస్థితుల మధ్య దట్టమైన పొగమంచు అనేక రాష్ట్రాలను కప్పేస్తోంది. భారతీయ రైల్వే మొరాదాబాద్ డివిజన్ డిసెంబర్ 2023లో 20వేల రిజర్వ్ చేసిన టిక్కెట్లను రద్దు చేసింది. మొరాదాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డీఆర్‌ఎం) రాజ్ కుమార్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు దాదాపు రూ.1.22 కోట్లు తిరిగి వచ్చాయి.  మొత్తం క్యాన్సిల్ చేసిన రిజర్వ్ చేసిన టిక్కెట్లలో 4వేల 230 బరేలీలో, 3వేల 239 టిక్కెట్లు మొరాదాబాద్‌లో, 3వేల 917 టిక్కెట్లు హరిద్వార్‌లో, 2వేల 448 ఇతర డెహ్రాడూన్‌లో రద్దు చేయబడ్డాయి.

పొగమంచు కారణంగా తక్కువ ఆక్యుపెన్సీ ఉన్న రైళ్లను తాము క్యాన్సిల్ చేశామని.. దీని వల్ల 2023 డిసెంబర్‌లో మొరాదాబాద్ డివిజన్‌లో 20వేల టిక్కెట్లు రద్దు చేయబడ్డాయని సింగ్ చెప్పారు. మార్చి వరకు 42 రైళ్లు క్యాన్సిల్ కావడంతో.. తాము ప్రజలకు 1.22 కోట్ల రూపాయలు తిరిగి ఇచ్చామ చెప్పారు. ఇక పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, తూర్పు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాలలో మరికొన్ని రోజుల పాటు రాత్రి, ఉదయం చాలా గంటలపాటు దట్టమైన పొగమంచు పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంది.