రైల్వే ఆదాయానికి రెక్కలు..71 శాతం పెరిగిన ఆదాయం

 రైల్వే ఆదాయానికి రెక్కలు..71 శాతం పెరిగిన ఆదాయం

భారత రైల్వేలకు ప్రయాణికుల రవాణా ద్వారా వచ్చే ఆదాయం  2022 ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్యకాలంలో  71 శాతం పెరిగింది. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్ల విభాగం నుంచి రూ.48,913 కోట్ల ఆదాయం వచ్చింది. అంతక్రితం ఏడాది (2021)  ఇదే టైంలో ఈవిభాగంలో రూ.28,569 కోట్ల ఆదాయమే రాగా, ఈ సారి 71 శాతం అదనపు ఆదాయాన్ని ప్యాసింజర్ రైళ్లు ఆర్జించిపెట్టాయి. ఈ మేరకు రైల్వే శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది.  

ప్రత్యేకించి రిజర్వ్డ్ ప్యాసింజర్ విభాగంలో ఆదాయం 56 శాతం పెరిగిందని తెలిపింది. 2021 సంవత్సరంలో ఈ కేటగిరి ఆదాయం రూ.26,400 కోట్లే ఉండగా..2022లో ఇది గణనీయంగా పెరిగి రూ.38,483 కోట్లకు చేరిందని పేర్కొంది. ఇక ఇదే వ్యవధిలో అన్ రిజర్వ్డ్ ప్యాసింజర్ విభాగంలో రైల్వే ఆదాయం రూ.2,169 కోట్ల నుంచి రూ.10,430 కోట్లకు పెరిగింది.