ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైళ్ల వేగం పెరిగింది

ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై రైళ్ల వేగం పెరిగింది

రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు…జర్నీ సమయాన్ని తగ్గించేందుకు ట్రైన్ల స్పీడ్ ను పెంచేలా చర్యలు చేపట్టింది. 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మార్గాల్లో రైళ్ల వేగాన్ని పెంచాలని.. ప్రయాణ సమయాన్ని తగ్గించాలని రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే నాలుగేళ్లలో ఈ రెండు మార్గాల్లో రైళ్ల వేగాన్ని 160 కిలోమీటర్ల వేగానికి పెంచాలని నిర్ణయించినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ అధికారులు చెప్పారు. ట్రైన్ల స్పీడ్ పెంచడంతో ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబైల మధ్య ప్రయాణ సమయం 12 గంటలు, 10 గంటలకు తగ్గుతుందన్నారు. ప్రస్తుతం ఈ ప్రయాణ సమయం 17 గంటలు, 15.5 గంటలుగా ఉంది.