రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తగ్గనున్న స్పెషల్ చార్జీలు

రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తగ్గనున్న స్పెషల్ చార్జీలు

న్యూఢిల్లీ: జనరల్ ప్యాసింజర్‌‌‌‌ ట్రైన్‌‌ సర్వీసులను రీస్టార్ట్ చేయాలని ఇండియన్ రైల్వే  నిర్ణయించింది. మెయిల్, ఎక్స్‌‌ప్రెస్‌‌ ట్రైన్లకు పెట్టిన స్పెషల్ ట్యాగ్‌‌ను తీసేయాలని జోనల్‌‌ రైల్వేలను ఆదేశించింది. ఈ ఆదేశాలను వెంటనే అమలులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కరోనాకు ముందున్న టికెట్ రేట్లను అందుబాటులోకి తేవాలని పేర్కొంది. ఈ ఆదేశాలతో సుమారు 1,700 ట్రైన్లలో ఇదివరకు పెంచిన 15% స్పెషల్​ చార్జీలు తగ్గనున్నాయి. అయితే, కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకోవలసిన చర్యలను మాత్రం కొనసాగించాలని నిర్ణయించింది. కౌంటర్‌‌‌‌లో టికెట్ల అమ్మకాలు, రైళ్లలో వండిన ఫుడ్‌‌ను అందించకపోవడం, అధిక ధరలకు ప్లాట్‌‌ఫామ్ టికెట్ల అమ్మకాలు వంటివి కొనసాగుతాయని చెప్పింది. ‘

‘కరోనా వ్యాప్తి పూర్తిగా తొలగిపోలేదు. రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకే పెంచిన ప్లాట్‌‌ఫాం టికెట్ల రేట్లను తగ్గించడంలేదు. కౌంటర్‌‌‌‌లో టికెట్ల అమ్మకాలపై నిషేధాన్ని కొనసాగిస్తున్నాం. రైళ్లలో ప్రిపేర్ చేసిన ఫుడ్‌‌ను సర్వ్‌‌ చేయడం లేదు” అని చెప్పింది. 2021–22 ఫైనాన్షియల్‌‌ ఇయర్‌‌‌‌ మొదటి ఆరు నెలల్లో ప్యాసింజర్ చార్జీల ద్వారా రైల్వేస్‌‌కు రూ.15,434.18 కోట్లు ఆదాయం పొందింది. ట్రైన్ నెంబర్లను మార్చే చర్యల్లో భాగంగా ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్‌‌ను రాత్రి సమయంలో 6 గంటలపాటు వారంరోజులు నిలిపివేస్తామని స్టేట్‌‌మెంట్‌‌ రిలీజ్ చేసింది.