గత మూడు రోజులుగా హైదరాబాద్ నగరాన్ని వాన వదలడం లేదు.. ఉదయం నుంచి మధ్యాహ్నంవరకు ఎండ దంచికొడుతోంది. సాయంత్రానికల్లా ఒక్కసారిగా వాతావరణ మారిపోతుంది. సాయంత్రం 4 గంటల దాటిందంటే.. ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొని వర్షం పడుతోంది.
దివారం మధ్యాహ్నం హైదరాబాద్ సిటీలో పలు చోట్లు వాన పడుతోంది. పాతబస్తీలోని బండ్లగూడ, చాంద్రాయణగుట్ట, ఛత్రినాక, శాలిబండ, ఫలక్ నుమా, కాంచన్ బాగ్, సంతోష్ నగర్ ప్రాంతాల్లో వర్షం పడింది. మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది.
మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా సిటీలో వాతావరణ మారిపోయింది. అప్పటివరకు ఎండ కాచి.. ఆతర్వాత వాతావరణం మేఘావృతం అయింది. రాబోయే రెండు గంటల్లో రాజేంద్రనగర్, చార్మినార్ కార్వాన్, మెహదీపట్నం, మలక్ పేట్, ఎల్బీ నగర్ పరిసర ప్రాంతాల్లో తేలిపకపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
