మ్యాచ్ను మలుపుతిప్పిన వరుణుడు..!

మ్యాచ్ను మలుపుతిప్పిన వరుణుడు..!

టీ20 ప్రపంచకప్లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ విక్టరీతో టీమిండియా సెమీస్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేసుకుంది. టీమిండియా విజయంలో వరుణుడు కూడా కీ రోల్ పోషించాడనే చెప్పాలి. టీమిండియా నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా జట్టుకు ఓపెనర్లు లిటన్ దాస్ (60), షాంటో (21) అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు.  దొరికిన బంతిని దొరికినట్టుగా బౌండరీకి తరలించారు. 7 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా ఆ జట్టు 66 పరుగులు చేసింది. ఓ క్రమంలో ఈజీగానే టార్గెట్ ను బంగ్లా ఫినిష్  చేస్తుందని అనిపించింది. అయితే అప్పుడే వరుణుడు ఎంట్రీ ఇవ్వడంతో మ్యాచ్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. 

వర్షం తరువాత బంగ్లా టార్గెట్ 9 ఓవర్లలో 85 పరుగులు కావడంతో.. టార్గెట్ ను ఫినిష్ చేసే క్రమంలో ఆ జట్టు తొందరగానే  ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. లిటన్ దాస్ (60)  అనవసరమైన పరుగుకు కోసం ప్రయత్నించి రనౌట్  అయ్యాడు.  కాసేపటికే షాంటో (21) కూడా వెనుదిరిగాడు. ఆ తరువాత వచ్చిన అసిఫ్‌ (3),  షకిబ్ (13), యాసిర్‌ (1) , మొసాడెక్ (6) వెంటవెంటనే వెనుదిరిగడంతో మ్యాచ్ టీమిండియా చేతిలోకి వచ్చేసింది. చివర్లో  టస్కిన్ అహ్మద్  (11),  నురుల్‌ (12) కాస్త  టెన్షన్ పెట్టినప్పటికీ మ్యాచ్ టీమిండియా వశం అయింది. టీమిండియా తరుపున అర్ష్ దీప్, పాండ్యా చేరో రెండు వికెట్లు తీశారు.