
- ఎక్కడ చూసినా నడుం లోతు నీళ్లు
- పలు విమానాలు రద్దు
- రానున్న కొన్ని గంటల్లో భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ఢిల్లీ ఎన్ సీఆర్ లో స్తంభించిన జనజీవనం
- వర్షం నీటిలో మునిగిపోయిన అండర్ పాస్ వేస్
ఢిల్లీలో భారీవర్షం కురుస్తోంది. బుధవారం జూలై 31,2024 సాయంత్రం కురిసిన భారీ వర్షాలకు ఢిల్లీ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. ఢిల్లీ ఎన్ సీఆర్ లో జనజీవనం స్తంభించి పోయింది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. దీంతో ట్రాఫిక్ పై తీవ్ర ప్రభావం ఏర్పడింది. పలు విమానాల రాకపోకలు రద్దయ్యాయి.
ఢిల్లీ -నోయిడా ఎక్స్ ప్రెస్ వే, మధుర హైవే సహా ప్రధాన రహదారులపై వాహనాలు కిలోమీటర్ల వరకు నిలిచిపోయాయి. సెంట్రల్ ఢిల్లీలోని ప్రగతి మైదాన్ అబ్జర్వేటరీలో కేవలం ఒక్క గంటలో 112.50 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయిందంటే ఏ రేంజ్ లో వర్షం కురిసిందో తెలుస్తోంది.
వేసవి తర్వాత కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు రహదారులు జలమయమయ్యాయి. చాలా చోట్ల డ్రైనేజీ పొంగిపొర్లుతూ వీధుల్లోకి నీటిని పంపింగ్ చేస్తున్నాయి.ITO, RK పురం, జన్‌పథ్, పార్లమెంట్ స్ట్రీట్, కరోల్ బాగ్, నౌరోజీ నగర్, పంత్ మార్గ్, మయూర్ విహార్ వంటి ప్రాంతాల్లో రోడ్లన్నీ చెరువుల్లా తలపిస్తున్నాయి.
నోయిడాలోని గౌర్ సిటీ, ఫిల్మ్ సిటీ, ఢిల్లీ- నోయిడా ఎక్స్ ప్రెస్ వేలోని అనేక అండర్ పాస్ లతో సహా చాలా ప్రాంతాలు నీట మునిగాయి.
గురుగ్రామ్ లోని సుభాష్ నగర్, ఓల్డ్ రైల్వే రోడ్డు వంటి ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై నడుం లోతు నీళ్లు చేరాయి. భారీ వర్షాలతో భారీగా ట్రాఫిక్, జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.
రానున్న గంటల్లో భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాల కురుస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ వీకే సక్సేనా అధికారులను ఆదేశించారు.