బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం : వచ్చే మూడు రోజులు తెలంగాణలో వర్షాలు

నిన్నటి వరకు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డ రాష్ట్ర ప్రజలకు చల్లటి కబురు.  బంగాళాఖాతంలో ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం వల్ల రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుండి 4.5  నుండి 5.8 కిమీ మధ్యలో ఉపరితల ఆవర్తనం  ఏర్పడింది.   ఈ రోజు  దిగువ స్థాయిలోని గాలులు తెలంగాణ  వైపుకి వీస్తున్నాయి.     దీంతో రాగల మూడు రోజులు తెలంగాణలో  తేలికపాటి నుండి మోస్తారు  వర్షాలు  అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.  ఇవాళ్టి నుంచి  సంగారెడ్డి, మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ ,యాదాద్రి జోగులాంబ, నాగర్ కర్నూల్, మెదక్, సిద్దిపేట, వనపర్తి జిల్లాలో తేలికటి నుంచి మోస్తారు, భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. 

హైదరాబాద్ లో ఉద‌యం 9 గంట‌ల వ‌ర‌కు బాగా ఎండ‌, ఉక్క బోత‌గా ఉండ‌గా.. ఆ త‌ర్వాత హైద‌రాబాద్ సిటీ మొత్తం కారుమ‌బ్బులు క‌మ్మేశాయి. 2023, ఆగ‌స్ట్ 12వ తేదీ ఉద‌యం 10 గంట‌ల నుంచి వాతావ‌ర‌ణం చ‌ల్లబ‌డింది. చ‌ల్లటి గాలులు వీచాయి. సిటీలోని చాలా చోట్ల వ‌ర్షం పడుతుంది. కూక‌ట్ ప‌ల్లి, హైటెక్ సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గ‌చ్చిబౌలి, సికింద్రాబాద్ ఏరియాల్లో వ‌ర్షం ప‌డుతోంది.  పంజాగుట్ట, అమీర్ పేట, షేక్ పేట, ఉప్పల్,సికింద్రాబాద్ వంటి ప్రాంతాల్లో వర్షం పడుతోంది . హైదరాబాద్‌లో రానున్న 2 గంటల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.