రాబోయే రెండు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

రాబోయే రెండు రోజుల్లో పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు

దేశ రాజధాని ఢిల్లీలో ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. నిన్నటి నుంచి కురుస్తున్న వర్షాలతో ప్రజలు, వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు వరద నీటిలో మునిగాయి. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల ఢిల్లీ రీజియన్ లో విద్యుత్ కోతలు, ఆస్తి నష్టం జరిగిందని అధికారులు తెలిపారు.పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి.

అటు యూపీలో కూడా భారీగా వర్షాలు పడుతున్నాయి. ఘజియాబాద్, గుర్ గ్రామా ప్రాంతాల్లో వరద నిలిచిపోయింది. పలు ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. దీంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడ్డాయి. రోడ్లపై నీరు నిలవడంతో.. వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైవే పైన కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

బీహార్, పంజాబ్ లో రాబోయే రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఆయా రాష్ట్రాల్లో వెదర్ మొత్తం కూల్ గా మారిపోయిందని..ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని చెప్పారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  

మరిన్ని వార్తల కోసం

టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్లు లాంచ్‌

స్టార్టప్‌కు టోపి!