తెలంగాణలో రేపు వర్షాలు పడే జిల్లాలు ఇవే

తెలంగాణలో రేపు వర్షాలు పడే జిల్లాలు ఇవే

తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ తెలిపింది. ఆదిలాబాద్‌, నిర్మల్‌, కుమురం భీమ్‌, నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డిలో  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఏప్రిల్11 గురువారం కురిసిన చెదురుమదురు వర్షాల తర్వాత, ఏప్రిల్ 12 శుక్రవారం రోజు మరిన్ని వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హైదరాబాద్ అంచనా వేసింది.

 గురువారం రోజు వరంగల్, నారాయణపేట, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, వికారాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, సంగారెడ్డి, కామారెడ్డి, కుమురం భీమ్, ఆదిలాబాద్, మంచిర్యాలలో అక్కడక్కడా వర్షాలు కురిశాయి.  ఏప్రిల్ 14న తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ తెలిపింది.

వర్షపాతం ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 42 డిగ్రీల సెల్సియస్‌కు పైగానే నమోదవుతున్నాయి. హైదరాబాద్‌లో కూడా అత్యధికంగా షేక్‌పేటలో 39.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. అయితే, రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసిన నేపథ్యంలో తెలంగాణలో ఉష్ణోగ్రతలు 36 - 40 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గుతాయని IMD హైదరాబాద్ అంచనా వేసింది.