OTT Horror Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ కామెడీ.. 6 కోట్ల బడ్జెట్..115 కోట్ల వసూళ్లు..

OTT Horror Comedy: ఓటీటీలోకి సూపర్ హిట్ హారర్ కామెడీ.. 6 కోట్ల బడ్జెట్..115 కోట్ల వసూళ్లు..

2025లో కన్నడ బ్లాక్‌బస్టర్ అంటే, టక్కున గుర్తొచ్చే చిన్న బడ్జెట్ మూవీ.. ‘సు ఫ్రమ్ సో’. ఈ మూవీ కన్నడలోనే కాకుండా తెలుగులో సైతం సూపర్ సక్సెస్‌‌‌‌‌‌‌‌ను అందుకుంది. IMDBలో సైతం 9.1 రేటింగ్ దక్కించుకోవడం విశేషం.

జులై 25న కన్నడ, ఆగస్టు 8న తెలుగు థియేటర్లలో రిలీజై, ఆగస్టు 24 వరకు లాంగ్ రన్ కొనసాగించింది. ఆదివారం (ఆగస్టు 24న) కూడా రూ.2 కోట్లకి పైగా వసూళ్లు చేసింది. ప్రస్తుతం థియేటర్ రన్ క్లోజ్ అయింది. ఈ క్రమంలోనే ‘సు ఫ్రమ్ సో’ ఓటీటీ అప్డేట్ బయటకొచ్చింది.

ఈ సినిమాను జెపీ తుమినాడ్ తెరకెక్కించాడు. నటుడు రాజ్ బి శెట్టి ప్రొడ్యూస్ చేసి నటించాడు. ఇందులో శనీల్ గౌతమ్ లీడ్‌‌‌‌‌‌‌‌ రోల్‌‌‌‌‌‌‌‌లో నటించగా శాంధ్య ఆరకెరె, ప్రకాశ్ తుమినాడ్ ఇతర పాత్రలు పోషించారు. దర్శకుడు కీలకపాత్ర పోషించాడు. 

సూ ఫ్రమ్ సో ఓటీటీ & వసూళ్లు:

సూ ఫ్రమ్ సో.. ఇదొక రూరల్ కామెడీ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. గ్రామాల్లో సహజంగా ఉండే మూఢ నమ్మకాలు, జానపద కథల మేళవింపుతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించాడు. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్తో మూవీ తెరకెక్కించారు. బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.115 కోట్ల గ్రాస్, రూ.85.9 కోట్ల ఇండియా నెట్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక్క కన్నడలోనే రూ.78.53 కోట్లకి పైగా నెట్ వసూళ్లు చేసింది. ఇపుడీ మూవీ థియేటర్ లాంగ్ రన్ కంప్లీట్ చేసుకున్నట్లే అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. 

►ALSO READ | GHAATI: ‘ఘాటి’ సెన్సార్ రివ్యూ.. అనుష్క క్రైమ్ డ్రామా కథేంటీ? క్రిష్ కమ్‌బ్యాక్‌ ఇస్తాడా?

ఈ క్రమంలో సూ ఫ్రమ్ సో మూవీ త్వరలో ఓటీటీకి రానుందనే టాక్ బయటకొచ్చింది. సెప్టెంబర్ 5 నుంచి జియోహాట్‌స్టార్లో స్ట్రీమింగ్కి అందుబాటులో ఉండబోతుందని సమాచారం. అయితే, మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 

సూ ఫ్రమ్ సో కథ:

ఆవారాగా తిరిగే అశోక్‌‌‌‌‌‌‌‌ అనే కుర్రాడి చుట్టూ మూవీ స్టోరీ సాగుతోంది. అతను ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. అతడు ఆ అమ్మాయి ఉండే ఊరికి వెళతాడు. ఆ తర్వాత ఆ ఊర్లో కొన్ని ఊహించని సంఘటనలు జరగడం, జనంలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి.

ఈ క్రమంలో, అతనిని సోమేశ్వర నుంచి వచ్చిన సులోచన అనే దెయ్యం ఆవహించిందని పుకార్లు వ్యాపిస్తాయి. ఆ తర్వాత ఊర్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? చివరికి తన ప్రేమను సాధిస్తాడా? అసలు సులోచన ఎవరు? తదితర విషయాలు తెలియాలంటే మూవీ చూడాల్సిందే.