గోదావరిఖని, వెలుగు: పదేండ్లపాటు సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసి, దోపిడీకి గురిచేసిందిబ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రామగుండం ఎమ్మెల్యే, అసెంబ్లీ బీసీ వెల్ఫేర్‌కమిటీ చైర్మన్ఎంఎస్ రాజ్ఠాకూర్ ఆరోపించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని క్యాంప్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్, బొగ్గు వాడుకున్నందుకు జెన్కో, ట్రాన్స్‌కో నుంచి సుమారు రూ.45 వేల కోట్ల బకాయిలు సింగరేణికి రావాల్సి ఉండగా.. వాటిని చెల్లిస్తామని చెప్పిన అప్పటి సీఎం కేసీఆర్ చెల్లించలేదన్నారు.
బీఆర్ఎస్ హయాంలోనే సింగరేణిలో అనేక కుంభకోణాలు జరిగాయని, మెడికల్ బోర్డు దందా చేసి రూ.కోట్లు దండుకున్న వ్యవహారంలో ఆ పార్టీ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ లీడర్లు అరెస్టయిన విషయాన్ని గుర్తుచేశారు. బీఆర్ఎస్హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణిలో బొగ్గు మాయమైన ఘటనలు ఎక్కడా జరగకపోయినా కోల్‌బెల్ట్ ఏరియాల్లో స్ర్కీన్లను పెట్టి అబద్ధపు లెక్కలతో హరీశ్ రావు ప్రచారం చేస్తున్నారని.. వాటిని కార్మికులు, ప్రజలేవరు నమ్మరని అన్నారు. మేయర్మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పి.ఎల్లయ్య, జాలి రాజమణి, బాలరాజు, జిరమేశ్, డి.సతీశ్, మారెల్లి రాజిరెడ్డి, కార్పోరేటర్లు పాల్గొన్నారు.
