రాజ్ తరుణ్ హీరోగా భలే ఉన్నాడే.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

రాజ్ తరుణ్ హీరోగా భలే ఉన్నాడే.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్

రాజ్​ తరుణ్​ హీరోగా  కొత్త మూవీని అనౌన్స్ చేశాడు. జె శివసాయి వర్ధన్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. డైరెక్టర్ మారుతి సమర్పణలో ఎన్వీ కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. సంక్రాంతి విషెస్ తెలియజేస్తూ ఈ మూవీ టైటిల్‌‌‌‌‌‌‌‌తో పాటు ఫస్ట్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

‘భలే ఉన్నాడే’ అనే క్యాచీ టైటిల్‌‌‌‌‌‌‌‌ను ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌లో రాజ్ తరుణ్‌‌‌‌‌‌‌‌ని రాధగా ప్రజెంట్ చేశారు. స్టైలిష్‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తూ..  చిరునవ్వుతో నడుస్తున్నప్పుడు బ్యాక్‌‌‌‌‌‌‌‌గ్రౌండ్‌‌‌‌‌‌‌‌లో పువ్వులు, మేకప్ వస్తువులతో ఆసక్తికరంగా ఉందీ పోస్టర్.  కృష్ణ పాత్రలో మనీషా కంద్కూర్ హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయం అవుతుండగా, సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ కీలక పాత్రలో కనిపించనున్నారు.