
- విఘ్నేష్ రెడ్డి గవి, శ్రీ ఆశ్రిత లీడ్ రోల్స్‌లో ప్రనిల్ గౌరీ పాగ తెరకెక్కిస్తున్న చిత్రం
‘రాజా రమ్యం’. కోకొండ జయచందర్ రెడ్డి, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మిస్తున్నారు. ఆర్వన్ గండికోట కథ, స్క్రీన్ ప్లే అందించాడు. ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ఓ పల్లెటూరు నేపథ్యంలో స్కూల్ డ్రెస్‌లో ఉన్న అమ్మాయి, అబ్బాయి ఒకే సైకిల్‌పై వస్తున్నట్టుగా కనిపించారు.
ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే ఒక అద్భుతమైన కథను, ఓ అందమైన విలేజ్ డ్రామాగా చూపించబోతున్నాం అని చెబుతున్నారు మేకర్స్. ఇప్పటికే షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే ఇతర వివరాలను తెలియజేస్తామన్నారు.