Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ లోడింగ్..హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి!

Raja Saab: రాజా సాబ్ ఫస్ట్ సింగిల్ లోడింగ్..హింట్ ఇచ్చిన డైరెక్టర్ మారుతి!

డార్లింగ్ ప్రభాస్ (Prabhas) హీరోగా తెరకెక్కుతున్న మూవీ రాజాసాబ్(Rajasaab). ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది ఈ సినిమా. ఇందులో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, ఆషికా రంగనాథ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.కట్టప్ప సత్యరాజ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు.

గతేడాది అక్టోబర్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది.అయితే,ప్రస్తుతం ఈ మూవీ అప్డేట్స్ ఏంటీ? అసలు షూటింగ్ జరుగుతుందా? డార్లింగ్ ఎప్పుడొస్తాడు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ లోడ్ అవుతున్నట్టు తెలుస్తోంది.  ఈ తరుణంలోనే ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ గురించి డైరెక్టర్ మారుతీ ఓ హింట్ వదిలారు.

బేబి మూవీ ప్రొడ్యూసర్ ఎస్‍కేఎన్ ఏప్రిల్ 16న ఓ ట్వీట్ చేశారు. పాట అదిరిపోయిందనేలా సింబల్స్, ఫైర్,లవ్ వంటి ఎమోజీలతో పోస్ట్ చేశారు.కానీ, ఇక్కడ ఏ మూవీ నుంచి అనేది మాత్రం వెల్లడించలేదు.అయితే, ఎస్‍కేఎన్ చేసిన ఈ ట్వీట్‍కు రాజాసాబ్ డైరెక్టర్ మారుతీ మాత్రమే స్మైలీ సింబల్‍ ఇస్తూ రిప్లై ఇచ్చారు.దీంతో..ఇది రాజాసాబ్ నుంచి ఫస్ట్ సాంగ్ ఆల్రెడీ రెడీ అయిందని తెలిసిపోయింది. అందుకు ఇప్పటికే ఇండస్ట్రీ ప్రముఖులకు వినిపించినట్టు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ప్రభాస్ ఫ్యాన్స్ కుమ్మేద్దాం అన్న..అంటూ ఖుషి అవుతున్నారు 

ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.తమన్ సంగీతం అందిస్తున్నారు.రీసెంట్ గా సంక్రాంతి కానుకగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ వీడియోకు ఆయన ఇచ్చిన బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ ఆగిపోయింది. దీంతో ఈ ఫస్ట్ సింగిల్ పై భారీ అంచనాలే ఉన్నాయి.ఈ మూవీలో ప్రభాస్‍కు జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.