
జనగామ జిల్లా: రాజయ్య నీ స్థాయి తగ్గకుండా నిన్ను, నీ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తా అని సీఎం కేసీఆర్ గారు నాకు మాట ఇచ్చారన్నారు తాటికొండ రాజయ్య. శుక్రవారం జనగామ బహిరంగ సభలో మాట్లాడిన రాజయ్య.. బీజేపీ రాబంధువులు అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారని.. దళితబంధు, మహిళాబంధు కేసీఆర్ అన్నారు. బహుజనుల బంధువు.. అంబేద్కర్ ఆలోచనలు.. ఆయన ఆశయాలతో దళితబంధు తీసుకొచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. రాబోయే రెండు సంవత్సరాల్లో దళితబంధు దేశవ్యాప్తాంగా అమలుకావాలన్నారు. దేశ్ కీ నేత సీఎం కేసీఆర్ అని.. మన రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం కావడంతో కేసీఆర్ ను దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. స్టేషన్ ఘన్ పూర్ కు ఢిగ్రీ కాలేజీ ఇచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. అయితే వేదికకు స్వాగతం పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రాజయ్యను 2 నిమిషాలు మాత్రమే మాట్లాడాలన్నారు. దీంతో ఎన్నో విషయాలు చెప్పే రాజయ్య పల్లా రాజేశ్వర్ రెడ్డి ముందే సమయాన్ని కేటాయించడంతో రాజయ్య స్పీచ్ తొందరగా ముగించాడు.