కంగువ లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి: రాజమౌళి

కంగువ లాంటి సినిమాలు అరుదుగా వస్తాయి: రాజమౌళి

సూర్య హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘కంగువ’. శివ దర్శకుడు.  కేఈ జ్ఞానవేల్ రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించారు. నవంబర్ 14న పాన్ ఇండియా వైడ్‌‌గా  విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు. అతిథిగా హాజరైన రాజమౌళి మాట్లాడుతూ ‘నేను పాన్ ఇండియా మూవీస్ చేసేందుకు స్ఫూర్తినిచ్చింది సూర్యనే. తన నటన, ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు చాలా ఇష్టం. 

దర్శకులను కాకుండా, మంచి కథలను సెలెక్ట్ చేసుకుని జర్నీ చేస్తున్నాడు. ‘కంగువ’లాంటి చిత్రాలు అరుదుగా వస్తాయి. వాటిని థియేటర్స్‌‌లోనే చూడాలి. అప్పుడే సినిమాటిక్ ఎక్స్‌‌పీరియెన్స్ పొందుతారు’ అని చెప్పారు. నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు,   హీరోలు సిద్ధు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్, దర్శకుడు బోయపాటి ఈ కార్యక్రమంలో పాల్గొని టీమ్‌‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. సూర్య మాట్లాడుతూ ‘మమ్మల్ని సపోర్ట్ చేయడానికి వచ్చిన ప్రతి  ఒక్కరికీ థ్యాంక్స్.

ఇది ఎవర్‌‌‌‌గ్రీన్ సినిమా. ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంది’ అని చెప్పాడు.  ‘వెయ్యేళ్ల కిందటి కథలో ఐదు తెగల మధ్య అనుబంధాలు, ప్రేమలు, ప్రతీకారం, పోరాటం వంటివన్నీ రా అండ్ రస్టిక్‌‌గా రూపొందించాం. ఇదొక విజువల్ ఫీస్ట్’ అని దర్శకుడు శివ చెప్పాడు. సినిమా సక్సెస్‌‌పై కాన్ఫిడెంట్‌‌గా ఉన్నామని  నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా అన్నారు. టీమ్ అంతా పాల్గొన్నారు.