టాలీవుడ్ దర్శకుల సంక్షేమం ట్రస్ట్: రాజమౌళి భారీ విరాళం

టాలీవుడ్ దర్శకుల సంక్షేమం ట్రస్ట్: రాజమౌళి భారీ విరాళం

టాలీవుడ్ దర్శకుల సంక్షేమం కోసం దిగ్గజ దర్శకుడు కె.రాఘవేంద్రరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ ట్రస్ట్‌ (TFDT) కి మరో డైరెక్టర్ SS రాజమౌళి రూ.50 లక్షల భారీ విరాళం అందించారు.

సినీ ఇండస్ట్రీలోని అందరి సహకారంతో ట్రస్ట్‌ను ఈ నెల 24న రిజిస్టర్ చేసినట్టు తెలిపారు రాఘవేంద్రరావు. తెలుగు చలన చిత్ర దర్శకుల దినోత్సవమైన మే 4న రాఘవేంద్రరావు TFDTని ప్రకటించారు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి రూ.25 లక్షలు ప్రకటించారు. రాఘవేంద్రరావు రూ.10 లక్షలు, ఆర్కే మీడియా సంస్థ రూ. 15 లక్షలు ప్రకటించింది. ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక భారీ నిధిని ఏర్పాటు చేసి, దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బుతో కష్టాల్లో ఉన్న దర్శకుల కుటుంబాలకు సహాయం చేయాలనేది ముఖ్య ఉద్దేశం.