రాజన్న హుండీ ఆదాయం రూ. 1.53 కోట్లు

రాజన్న హుండీ ఆదాయం రూ. 1.53 కోట్లు

 వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయంలోని హుండీలను గురువారం లెక్కించారు. 28 రోజులకు సంబంధించిన హుండీలను ఆలయ ఓపెన్‌‌‌‌ స్లాబ్‌‌‌‌లో లెక్కించగా రూ. 1,53,48,267 ఆదాయం వచ్చినట్లు ఆఫీసర్లు చెప్పారు. నగదుతో పాటు 157.300 గ్రాముల బంగారం, 12.500 కిలోల వెండి వచ్చినట్లు ఈవో రామకృష్ణ తెలిపారు.