విద్యార్థులకు అందించే వస్తువులకు టెండర్లు : కలెక్టర్ గరిమా అగ్రవాల్

విద్యార్థులకు అందించే వస్తువులకు టెండర్లు : కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల,వెలుగు: జిల్లాలోని ఎస్సీ హాస్టల్​విద్యార్థులకు అందించే వస్తువులకు టెండర్లు పిలిచామని ఇన్‌‌‌‌చార్జి కలెక్టర్ గరిమా అగ్రవాల్ అన్నారు. ఇప్పటికే విద్యార్థులకు అందజేసే వస్తువులు, పరికరాల కోసం టెండర్లు పిలవగా మంగళవారం ఆ దరఖాస్తులుతో పాటు ఇతర పరికరాలను పరిశీలించారు. 

జామెట్రీ బాక్స్, స్కేల్, వరల్డ్ మ్యాప్, వాటర్ బాటిల్, ఆల్ ఇన్ వన్ బుక్స్, స్టడీ చైర్, దుప్పట్లు, పిల్లోస్‌‌‌‌, సీసీ కెమెరాలు, రగ్గులు, మొదలైన వస్తువుల కోసం టెండర్లు ఆహ్వానించి దరఖాస్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా వస్తువుల నాణ్యతను పరిశీలించి, వాటి ధరను కలెక్టర్ ఫైనల్ చేశారు. వారంలోగా ఆయా వస్తువులు విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. 

సమావేశంలో జిల్లా ఎస్సీ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫీసర్ రవీందర్ రెడ్డి, నాణ్యత కమిటీ సభ్యులు హనుమంతు, స్వప్న, ఏఎస్‌‌‌‌డబ్ల్యూవో విజయలక్ష్మి  పాల్గొన్నారు.