కేసీఆర్​ ఫామ్​హౌస్​లో రాజశ్యామల యాగం

కేసీఆర్​ ఫామ్​హౌస్​లో రాజశ్యామల యాగం
  • విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర పర్యవేక్షణలో నిర్వహణ
  • మూడు రోజులపాటు నిర్వహణ
  • యాగ సంకల్పం చెప్పిన కేసీఆర్​ దంపతులు

హైదరాబాద్, వెలుగు: ఎర్రవల్లిలోని తన ఫామ్​హౌస్​లో సీఎం కేసీఆర్​రాజశ్యామల యాగం చేపట్టారు. విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర ఆధ్వర్యంలో బుధవారం ఉదయం యాగానికి అంకురార్పణ చేశారు. రాజ శ్యామల సహిత సుబ్రహ్మణ్యేశ్వర యాగంగా దీనికి నామకరణం చేశారు. కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దంపతులు యాగ సంకల్పం చెప్పి.. పండితులకు దీక్షా వస్త్రాలు అందజేశారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన 170 మంది రుత్విక్కులు యాగంలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా రాజశ్యామల యాగం ప్రాముఖ్యతను స్వరూపానందేంద్ర వివరించారు. రుద్ర, చండీ, వనదుర్గ హోమాలు అన్నిచోట్లా జరుగుతాయని, రాజశ్యామల యాగం విశిష్టమైనదని చెప్పారు. రాజులతో పాటు సామాన్యులను అనుగ్రహించే రాజశ్యామల యాగం కఠినమైన భీజాక్షరాలతో కూడినదని తెలిపారు. 

మహా శక్తివంతమైన రాజశ్యామల యాగ ఫలితం సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికే కాకుండా, యావత్‌‌‌‌‌‌‌‌ రాష్ట్రానికి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్​గతంలో చేసిన రాజశ్యామల యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలమైందని, హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ మహానగరంగా అభివృద్ధి చెందిదని స్వరూపానందేంద్ర అన్నారు. ‘‘నాకు ఎందరో సీఎంలు తెలుసు. హైందవ తత్త్వం పరిపూర్ణంగా తెలిసిన నేత కేసీఆర్‌‌‌‌‌‌‌‌ మాత్రమే. బ్రాహ్మణుల సంక్షేమాన్ని కోరుకున్న కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబానికి రాజశ్యామల అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటున్న” అని ఆయన పేర్కొన్నారు. యాగం 3 రోజులపాటు కొనసాగనుంది. బుధ వారం ఉదయం గోపూజ అనంతరం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దంపతులు యాగశాల ప్రవేశం చేశారు. 

గురు ఆజ్ఞ తీసుకుని యాగాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాగం నిర్విఘ్నంగా కొనసాగాలని ముక్కోటి దేవతలను ప్రార్థిస్తూ అస్త్ర రాజార్చన, కర్కరీయ స్థాపన నిర్వహించారు. కేసీఆర్​దం పతులు శత చండీయాగం కూడా చేశారు. యా గంలో ఎంపీలు సంతోష్​కుమార్, నామా నాగేశ్వర్​ రావు, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ప్రభుత్వ సలహాదారు అనురాగ్​శర్మ తదితరులు పాల్గొన్నారు.