ప్రధాని హోదాలో ఉండి.. చిల్లర మాటలా? : సీఎం అశోక్​ గెహ్లాట్

ప్రధాని హోదాలో ఉండి.. చిల్లర మాటలా? : సీఎం అశోక్​ గెహ్లాట్

జైపూర్: కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్లపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ మండిపడ్డారు. ప్రధాని స్థాయి హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి చిల్లర కామెంట్లు చేసుడేందని ప్రశ్నించారు. మంగళవారం మధ్యప్రదేశ్​లో జరిగిన ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘‘మేడ్ ఇన్ చైనా ఫోన్ అంటున్న ఆ మహాజ్ఞాని.. కింగ్ ఆఫ్​ ఫూల్స్(మూర్ఖోంకే సర్దార్). ఫారిన్ కళ్లద్దాలు పెట్టుకున్నోడికి ఇక్కడి డెవలప్​మెంట్ ఎట్ల కనిపిస్తది”అని ఎగతాళి చేశారు. 

ఈ కామెంట్లను అశోక్ గెహ్లాట్ తప్పుపట్టారు. ‘‘ఇది చాలా దురదృష్టకరం. ప్రధాని పదవికి గౌరవం ఉంది. ఆ పొజిషన్​లో ఉన్నోళ్లు ఎక్కువగా విమర్శిస్తే పదవికే మచ్చ. ఆ స్థాయిలో ఉండి దిగజారుడు కామెంట్లుచేసేవాళ్ల నుంచి మనం ఏం ఆశించగలం!’’ అని గెహ్లాట్ అసహనం వ్యక్తం చేశారు. చత్తీస్​గఢ్​ సీఎం భూపేశ్ బఘేల్ కూడా స్పందించారు. ఇతరులను దూషిస్తున్న తీరుతోనే ఆయనలో ఎంత అహంకారం పెరిగిందో కనిపిస్తోందన్నారు.