రాజస్థాన్ రైతుల వినూత్న నిరసనగా భూ సమాధి

రాజస్థాన్ రైతుల వినూత్న నిరసనగా భూ సమాధి

ప్రభుత్వం తలపెట్టిన భూసేకరణకు వ్యతిరేకంగా వినూత్న నిరసన చేపట్టారు రాజస్థాన్ రాష్ట్ర రైతులు.  జైపూర్ లోని నిందడ్ గ్రామ రైతులు.. జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ (జెడిఎ) భూసేకరణ నిబంధనలకు వ్యతిరేకంగా భూ సమాధి సత్యాగ్రహాన్ని ప్రదర్శించారు. పురుషులతో పాటు మహిళలు, పిల్లలు కూడా ఈ సత్యాగ్రహం చేస్తున్నారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు తమ ఈ నిరసన కొనసాగుతుందని రైతులు  అంటున్నారు. తాము చాలా కాలంగా భూసేకరణను వ్యతిరేకిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం తమ డిమాండ్ లను పట్టించుకోవట్లేదంటున్నారు అక్కడి రైతులు. నష్ట పరిహారంతో తమకు న్యాయం చేకూరదని అందుకే భూ సమాధి సత్యాగ్రహం చేస్తున్నామని అంటున్నారు.