జైపూర్: రాజస్తాన్ కేడర్ ఐఏఎస్ అధికారిణి భారతీ దీక్షిత్ తన భర్త, ఐఏఎస్ అధికారి ఆశిష్ మోదీపై గృహ హింస కేసు పెట్టింది. తన భర్త వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపించింది. భారతీ దీక్షిత్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన తండ్రి 2014లో క్యాన్సర్ తో పోరాడుతున్నప్పుడు ఆశిష్ మోదీ పెళ్లి చేసుకున్నారని భారతీ దీక్షిత్ ఆరోపించింది. ఆయన తన గురించి వాస్తవాలను దాచిపెట్టి తప్పుదోవ పట్టించారని.. నిరంతరం శారీరక, మానసిక వేధింపులకు గురి చేశారని తెలిపింది.
ఆశిష్ మోదీ ఎప్పుడు మద్యం సేవించేవారని, ప్రవర్తనను ప్రశ్నిస్తే తరచూ దాడి చేసేవారని పేర్కొంది. ఆశిష్ మోదీ సహచరులలో ఒకరు 2025, అక్టోబర్‌లో ప్రభుత్వ వాహనంలో తనను అపహరించారని తెలిపింది. విడాకులకు అంగీకరించకపోతే తనతో సహా తన కుటుంబాన్ని చంపుతామని బెదిరించారని ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు, తన కుటుంబానికి పోలీసు రక్షణ కల్పించాలని కోరింది.
