
పట్టువదలని విక్రమార్కుడు అని అంటుంటాం కదా.. అందుకు పై ఫోటోలో కనిపిస్తున్న ఇతను సరిగ్గా సరిపోతాడు. ఇతని పేరు తీతర్ సింగ్.. రాజస్థాన్ లో ఉంటాడు. 1970 నుండి పంచాయతీ నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు ప్రతి ఎన్నికల్లో పోటీ చేశాడు.. కానీ దురదృష్టవశాత్తు ప్రతీ ఎన్నికల్లో కూడా ఓడిపోయాడు. ప్రస్తుతం ఇతనికి 78 ఏళ్ల అయినప్పటికీ పోటీకి సై అంటున్నాడు.
నవంబర్ 25 రాజస్థాన్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం అవుతున్నాడు. కరణ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు 20 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా మళ్లీ ఎందుకు పోటీచేస్తున్నారని అడిగిన ప్రశ్నకు నేను ఎందుకు పోరాడకూడదు అని అతను బదులిచ్చారు. ప్రభుత్వం భూమి, సౌకర్యాలు ఇవ్వాలి.. ఈ ఎన్నికలు హక్కుల కోసం పోరాటం కానీ పాపులారటీ కోసం కాదని తీతర్ సింగ్ చెబుతున్నాడు. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలకు తన నామినేషన్ పత్రాలను దాఖలు చేస్తానని తెలిపాడు .
Also Read :- ఏం చేస్తారో తెలీదు.. వెంటనే ఆపేయండి.. అది మీ పని
దళిత సామాజిక వర్గానికి చెందిన తీతర్ సింగ్ కు ముగ్గురు కూతుళ్లు, ఇద్దరు కుమారులు ఉన్నారని, మనవళ్లకు కూడా పెళ్లిళ్లు అయ్యాయని వెల్లడించాడు. అయితే ఆస్తి ఏమీ లేదని వాహనాలు కూడా లేవని తెలిపాడు. సాధారణ రోజుల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA) కింద తాను రోజువారీ కూలీగా పని చేస్తున్నానని, ఎన్నికలు వచ్చిన వెంటనే ప్రచారం చేయడంపై దృష్టి సారిస్తానని సింగ్ చెప్పారు. ప్రతిసారీ డిపాజిట్లను కోల్పోయాడు. 2008 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో 938 ఓట్లు, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో 427, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 653 ఓట్లు సాధించారు.