KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. తుది జట్టులో అశ్విన్, బట్లర్

KKR vs RR: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్.. తుది జట్టులో అశ్విన్, బట్లర్

ఐపీఎల్ లో నేడు రెండు అగ్ర జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన రాజస్థాన్ రాయల్స్ తో కోల్ కతా నైట్ రైడర్స్ తలపడుతుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిధ్యమిస్తుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి రాజస్థాన్ రాయల్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్ ల్లో రాజస్థాన్ 5 మ్యాచ్ ల్లో గెలిచి అగ్ర స్థానంలో కొనసాగుతుంది. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ ఆడిన 5 మ్యాచ్ ల్లో నాలుగు మ్యాచ్ లు గెలిచి రెండో స్థానంలో నిలిచింది. 


కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI):

ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకూ సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI):

యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, కుల్దీప్ సేన్, యుజ్వేంద్ర చాహల్