
రాజస్థాన్‌లో 200 స్థానాలకు గానూ నవంబర్ 25న పోలింగ్ జరగనుంది. అయితే ఈసీ అధికారులు ఒక కుటుంబం కోసం ఏకంగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇండో-పాక్ సరిహద్దులోని బార్మర్ జిల్లాలోని సరిహద్దు మారుమూల గ్రామమైన బాద్మేర్ కా పార్ గ్రామంలో 35 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు.
35 మంది ఓటర్లలో 17 మంది మహిళలు, 18 మంది పురుషులు ఉన్నారు. గతంలో వీరంతా ఓటు వేయడానికి 20 కిలో మీటర్లు వెళ్లాల్సి వచ్చేది. ఒంటెలపై ప్రయాణం చేయడమా లేక నడవడమా జరిగేది. ఈసీ చోరవతో గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ALSO READ:అబండెన్స్ ఇన్ మిల్లెట్స్.. గ్రామీ 2024కి మోదీ సాంగ్ నామినేట్
రాష్ట్రంలో ఇదే అత్యంత చిన్న పోలింగ్ కేంద్రం కావడం విశేషం. తమ గ్రామంలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో ఆ గ్రామస్థుల్లో జోష్ నింపింది. ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా వేస్తామని వారు చెబుతున్నారు.