అబండెన్స్ ఇన్ మిల్లెట్స్‌.. గ్రామీ 2024కి మోదీ సాంగ్ నామినేట్

అబండెన్స్ ఇన్ మిల్లెట్స్‌.. గ్రామీ 2024కి మోదీ సాంగ్ నామినేట్

గాయకులు ఫాలు, గౌరవ్ షాతో పాటు ప్రధాన మంత్రి మోదీ కలిసి పాడిన 'అబండెన్స్ ఇన్ మిల్లెట్స్' సాంగ్ బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ పెర్ఫార్మెన్స్ కేటగిరీ కింద గ్రామీ 2024కి నామినేట్ అయింది. అంతకుముందు ఐక్యరాజ్యసమితి 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా కేంద్రం ప్రకటించింది.

ఈ ఏడాది మార్చిలో గ్లోబల్ మిల్లెట్స్(శ్రీ అన్న) కాన్ఫరెన్స్‌ను ప్రారంభించిన సందర్భంగా మోదీ చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను ఈ పాటలో పొందుపర్చారు, అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ పాట జూన్ 16న విడుదలైంది. అంతకుముందు ఈ పాటపై స్పందించిన ఫాలు.. అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ పాటను సిద్ధం చేశామని, ఇందులో ప్రధాని మోదీ కూడా కనిపిస్తారని చెప్పారు. ఫాలుకి 2022లో గ్రామీ అవార్డు లభించింది. ఆమె కలర్‌ఫుల్ వరల్డ్ కోసం బెస్ట్ చిల్డ్రన్స్ ఆల్బమ్ విభాగంలో ఈ అవార్డును అందుకుంది.

ALSO READ: ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్

అవార్డు గెలుచుకున్న తర్వాత ఫాలు ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. ఆ సమయంలోనే మిల్లెట్ గింజలపై ఒక పాటను కంపోజ్ చేయాలనే ఆలోచనకు నాంది పలికింది. ‘తృణ ధాన్యాలపై పాటలో మోడీని భాగం చేయాలని మేం అనుకున్నాం. అందుకు మోడీ కూడా సానుకూలంగా స్పందించారు. అయితే ప్రధానితో కలిసి పాట రాసేందుకు మొదట మేం భయపడ్డాం. అయితే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేశాం. పాట మధ్యలో ప్రధాని కొన్ని మాటలు మాట్లాడతారని, ఈ సాంగ్‌కు అవే ప్రత్యేకాకర్షణగా నిలిచాయి’ అని అబండెన్స్ ఇన్ మిల్లెట్స్ సాంగ్ రిలీజ్‌ సందర్భంగా ఫాలు షా దంపతులు చెప్పుకొచ్చారు.

Also Read :- ఫ్యామిలీ కోసం స్పెషల్ పోలింగ్ బూత్