RCB vs SRH: బీసీసీఐ రూ.24 లక్షల భారీ ఫైన్.. చేయని తప్పుకు బలైన పటిదార్

RCB vs SRH: బీసీసీఐ రూ.24 లక్షల భారీ ఫైన్.. చేయని తప్పుకు బలైన పటిదార్

ఐపీఎల్ 2025లో రాయల్‌‌‌‌ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ చేయని తప్పుకు బలయ్యాడు. ఈ సీజన్ లో రెండో సారి స్లో ఓవర్ రేట్ కు గురయ్యాడు. శుక్రవారం (మే 6) సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ.24 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో రెండో సారి స్లో ఓవర్ రేట్ ఎదుర్కొన్న మూడో కెప్టెన్ గా నిలిచాడు. అంతకముందు హార్దిక్ పాండ్య, సంజు శాంసన్ ఈ లిస్ట్ లో ఉన్నారు. టాస్ ఓడి ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. సన్ రైజర్స్ మొదట బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఫీల్డింగ్ లో మార్పులు చేయడానికి జితేష్ శర్మ ఎక్కువ సమయం తీసుకున్నాడు.

గాయం కారణంగా పటిదార్ ఈ మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. పటిదార్ స్థానంలో స్టాండింగ్ కెప్టెన్ గా జితేష్ శర్మ ఆర్సీబీకి కెప్టెన్సీ చేశాడు. దీంతో జితేష్ శర్మ కెప్టెన్ గా స్లో ఓవర్ రేట్ కు కారణమైతే పటిదార్ శాశ్వత కెప్టెన్ కావడంతో జరిమానా విధించబడింది. రెండో సారి స్లో ఓవర్ రేట్ కావడంతో ఈ సారి కెప్టెన్ తో పాటు ముంబై జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు కూడా ఫైన్ వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ తో సహా జట్టులోని మిగిలిన ఆటగాళ్లకు టోర్నమెంట్ ప్రవర్తనా నియమావళి ప్రకారం.. ఒక్కొక్కరికి రూ. 6 లక్షలు లేదా వారి మ్యాచ్ ఫీజులో 25% ఏది తక్కువైతే అది జరిమానా విధించబడుతుంది.

ALSO READ | ENG vs IND: భారత టెస్ట్ కెప్టెన్‎గా శుభమన్ గిల్.. ఇంగ్లాండ్ టూర్‎కు టీమిండియా జట్టు ఇదే

మరోవైపు సన్ రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ కూడా స్లో ఓవర్ రేట్ నేరానికి పాల్పడినట్లు తేలింది. ఈ సీజన్ లో కమ్మిన్స్ కు తొలిసారి స్లో  ఓవర్ రేట్ కావడంతో అతనికి రూ. 12 లక్షల జరిమానా విధించారు. ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (48 బాల్స్‌‌‌‌లో 7 ఫోర్లు, 5 సిక్స్‌‌‌‌లతో 94 నాటౌట్‌‌‌‌) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌ 42 రన్స్‌‌‌‌ తేడాతో బెంగళూరుపై విజయం సాధించింది. టాస్‌‌‌‌ ఓడిన హైదరాబాద్‌‌‌‌ 20 ఓవర్లలో 231/6 స్కోరు చేసింది. 

అభిషేక్‌‌‌‌ శర్మ (34), క్లాసెన్‌‌‌‌ (24), అనికేత్‌‌‌‌ వర్మ (26) ఫర్వాలేదనిపించారు. తర్వాత బెంగళూరు 19.5 ఓవర్లలో 189 రన్స్‌‌‌‌కే ఆలౌటైంది. ఫిల్‌‌‌‌ సాల్ట్‌‌‌‌ (62) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. కోహ్లీ (43) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. కమిన్స్‌‌‌‌ 3, మలింగ 2 వికెట్లు తీశారు. ఇషాన్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. ఈ భారీ ఓటమితో బెంగళూరు రెండు నుంచి మూడో ప్లేస్‌కు పడిపోయింది.